Asianet News TeluguAsianet News Telugu

దళితబంధు జీవోను 24 గంటల్లో అప్‌లోడ్ చేయాలి: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

దళితబంధు జీవో ను 24 గంటల్లో అప్‌లోడ్ ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాసాలమర్రికి దళితబంధు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Telangana High court orders to upload Dalitha bandhu G.O within 24 hours
Author
Hyderabad, First Published Aug 18, 2021, 2:01 PM IST

హైదరాబాద్: దళితబంధుకి సంబంధించిన జీవో కాపీని 24 గంటల్లో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.వాసాలమర్రికి దళితబంధును అమలు చేయడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. నిబంధనలు ఖరారు చేయకుండానే  వాసాలమర్రికి దళితబంధు కింద నిధులు  మంజూరు చేశారని పిటిషనర్ ఆరోపించారు.

ఈ విషయమై హైకోర్టులో విచారణ జరిగింది. థ పథకానికి నిబంధనలు ఖరారు చేసినట్టుగా వివరించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్ లో లేదని పిటిషనర్ తరపు లాయర్ శశికిరణ్ తెలిపారు.

 జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందులు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలక అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.ఏజీ వివరణ నమోదు చేసి దళిత బంధుపై విచారణ ముగించింది హైకోర్టు జీవోను 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.దళిత కుటుంబాలన్నింటికి దళితబంధు వర్తిస్తోందని ప్రభుత్వ తరపు లాయర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios