హైదరాబాద్:  రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ ఆపొద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు  గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. కేఏపాల్  దాఖలు చేసిన పిటిషన్ ‌పై   తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది.  ఈ విచారణ సందర్భంగా  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని అని హైకోర్టు గుర్తు చేసింది. 

also read:సడెన్‌గా లాక్‌డౌన్ విధిస్తే ఎలా: తెలంగాణ హైకోర్టు ప్రశ్న

ఆసుపత్రుల్లో బెడ్స్ కన్ఫర్మేషన్  కాకున్నా కూడ  అంబులెన్స్ లను అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.రెండు రోజుల క్రితం కరోనాపై విచారణ సమయంంలో కూడ  రాష్ట్ర సరిహద్దల్లో  అంబులెన్స్ లను నిలిపివేయడంపై   తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  అంబులెన్స్ లు నిలిపివేసే విషయమై లిఖితపూర్వకమైన ఆదేశాలు ఉన్నాయా అని ఏజీని ప్రశ్నించింది. అయితే మౌఖిక ఆదేశాలు తప్ప రాతపూర్వక ఆదేశాలు లేవని  హైకోర్టుకు ఏజీ చెప్పారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను ముందస్తు అనుమతి ఉంటే అనుమతి ఇస్తున్నారు. అత్యవసర సరుకులు ఇతరత్రా ఎమర్జెన్సీ సేవల కోసం వచ్చేవారిు సరైన ధృవపత్రాలు చూపితే తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు.