Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకొంటేనే అనుమతివ్వాలి: తెలంగాణ సర్కార్ కి హైకోర్టు కీలక ఆదేశం

ఆర్టీపీసీఆర్ టెస్టులు  చేసుకొంటేనే  రాష్ట్రంలోకి అనుమతించాలని  తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది.

Telangana High court key orders to Government to allow  people after RTPCR Tests into state lns
Author
Hyderabad, First Published Apr 8, 2021, 12:14 PM IST

హైదరాబాద్:  ఆర్టీపీసీఆర్ టెస్టులు  చేసుకొంటేనే  రాష్ట్రంలోకి అనుమతించాలని  తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది.తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. తెలంగాణలో కోవిడ్ స్థితిగతులపై ప్రభుత్వం  గురువారం నాడు హైకోర్టుకు నివేదికను అందించింది.

మద్యం షాపులు, సినిమా హాల్స్ పై ఆంక్షలను విధించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను భారీగా పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.పబ్‌లు, క్లబ్బులపై కరోనా ఆంక్షలను విధించాలని హైకోర్టు సూచించింది.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో  కరోనా ను నిరోధించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది.

 

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ డేంజరస్ స్థితిలో ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.ఇవాళ ఒక్క రోజునే 2 వేల కరోనా కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతకు అద్దం పడుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios