దేవుడి పేరిట భూములు ఆక్రమించరాదని,దేవుడు కూడ చట్టానికి అతీతుడు కాదని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైదరాబాద్: దేవుడి పేరిట భూములు ఆక్రమించరాదని,దేవుడు కూడ చట్టానికి అతీతుడు కాదని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఖమ్మంలో టీటీడీ కళ్యాణ మండపానికి చెందిన భూ వివాదానికి సంబంధించి వీహెచ్ఫీ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య దాఖలు చేసిన పిల్ పై తెలంగాణ హైకోర్టు గురువారంనాడు విచారణ జరిపింది.
టీటీడీకి చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకొంటున్నారని విచారణ సందర్భంగా పిటిషనర్ పేర్కొన్నారు. టీటీడీ ఆధీననంలోో 12 గుంటలు అదనంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
అయితే టీటీడీ పక్క భూమిని కూడ ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని ఖమ్మం కార్పోరేషన్ హైకోర్టు తెలిపింది. ఈ భూమి వెనక్కి తీసుకొంటే టీటీడీ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. భూమికి సంబంధించిన దస్త్రాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది ఈ కేసు విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
రాష్ట్రంలో పలు చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. వీటిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
