హైదరాబాద్: ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ ఏడాది జూన్ 21వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది. 

ఈ పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్ల విషయమై  స్టే ను పొడిగిస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది.ధరణి పోర్టల్  విషయంలో ఏడు పిల్స్ లో రెండింటిని మాత్రమే కోర్టు విచారణకు స్వీకరించింది. ఒకే అంశంపై పలు పిల్స్ అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

ధరణి పోర్టల్ లో సాంకేతిక సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘం పరిశీలన చేస్తోందని అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాన్ని తెలుపుతామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. 

ధరణి పోర్టల్ విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పోర్టల్ లో సాంకేతిక సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేస్తోంది.వీటిని పరిష్కరించేందుకు ఈ కమిటీ ప్రయత్నాలను ప్రారంభించింది. ధరణిలో ఆస్తుల నమోదుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.