హరీష్ రావు ఘన విజయం.. ఈ సారి ఎంత మెజార్టీ సాధించారంటే.?  

Harish Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు ఘనవిజయం సాధించారు. వరుసగా 7వ భారీ మెజారిటీ తో గెలుపొందారు. ఈ సారి ఎంత మెజారిటీ సాధించారంటే.?

Telangana Harish Rao becomes only leader to win 7 times as MLA on car symbol KRJ

Harish Rao: హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ఓటమి చవిచూడని నేత. అవి సాధారణ ఎన్నికలైనా.. బై ఎలక్షన్ అయినా .. ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యం. భారీ మెజారిటీతో విజయం సాధించడం హరీష్ రావుకు అలవాటుగా మారింది. సిద్దిపేట నియోజక వర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తూ హరీష్ రావు దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు ఘన విజయం సాధించారు. తాజా 2023 తెలంగాణ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించారు. తనకు ఎదురులేని చాటుకున్నారు.  గత ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన హరీశ్ రావు .. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించినా గత ఎన్నికల కంటే కాస్త మెజారిటీ తగ్గింది. 

ఈ ఎన్నికల్లో సిద్దిపేటలో మొత్తం 1,78,420 ఓట్లు పోలవ్వగా..వీటిలో హరీష్ రావుకు.. లక్షకుపైగా ఓట్లు వచ్చాయి. అంటే.. 1,04,109 ఓట్లు వచ్చాయి. తన సమీప అభ్యర్థి అయిన పూజల హరికృష్ణకు 22,489 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో హరీష్ రావు 83,025 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరోసారి తనకు తిరుగులేదంటూ నిరూపించుకున్నారు.  ఈ సారి మెజార్టీ తగ్గడానికి మరో కారణం కూడా ఉంది. ఈ ఎన్నికల్లో (సిద్దిపేట నియోజకవర్గం) 76.33 శాతం ఓటింగ్‌ నమోదుగా..  గత (2018లో) ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్‌ నమోదైంది. అంటే.. గత ఎన్నికల కంటే.. ఈసారి పోలింగ్ తగ్గింది. ఆయనపై వ్యతిరేకత కాకున్నా.. ప్రభుత్వంపై వ్యతిరేకత.. అలాగే.. పోలింగ్ శాతం తగ్గటం ఇందుకు కారణం కావొచ్చని భావిస్తున్నారు.  

ఈ క్రమంలో హరీశ్ రావు అరుదైన రికార్డు సాధించారు. కారు గుర్తుపై ఇప్పటి వరకు ఏడుసార్లు గెలుపొందిన ఏకైక బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హరీష్ రావు నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తెలంగాణలో రికార్డు స్థాయిలో నాలుగు విజయాలు టీడీపీ టిక్కెట్‌పైనే ఉన్నాయి. తెలంగాణలో 

తెలంగాణ ఎన్నిక తరువాత ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ ని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు. అని ట్వీట్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios