క్వారంటైన్, కరోనా టెస్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

క్వారంటైన్ మీద, కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ గడువును 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Govt made quarantine for 28 days

హైదరాబాద్: క్వారంటైన్ మీద, కోరనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలకరమైన నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ ను 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సెకండరీ టెస్టులకు పరీక్షలు అవసరం లేదని స్పష్టం చేసింది.

ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని, సెకండరీ కాంటాక్టులకు అవసరం లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, వైద్యారోగ్య శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలావుంటే, సూర్యాపేటలో పరిస్థితి అదుపులోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ఆయనతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుధవారం సూర్యాపేటలో పర్యటించారు. లాక్ డౌన్ అమలుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. 

సూర్యాపేటలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మంగళవారం ఒక్క రోజే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా సూర్యాపేట పట్టణంలోనే నమోదయ్యాయి. 

అదే సమయంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న గద్వాల, వికారాబాద్ జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ జిల్లాల్లో పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ మూడు జిల్లాలకు ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. 

సూర్యాపేటకు వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది. మర్కజ్ నుంచి వచ్చినవారి గురించి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios