Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌తో విభేదాల్లేవు: కుండబద్ధలు కొట్టిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణకు గవర్నర్‌గా వెళ్లడంపై ఎన్నో విమర్శలు వచ్చాయని ఆమె తెలిపారు. 

telangana governor tamilisai soundararajan comments on clash with kcr ksp
Author
Hyderabad, First Published Feb 6, 2021, 7:08 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణకు గవర్నర్‌గా వెళ్లడంపై ఎన్నో విమర్శలు వచ్చాయని ఆమె తెలిపారు.

కానీ వాటిని సమర్థవంతంగా అధిగమించానని గవర్నర్ వెల్లడించారు. తెలంగాణ గవర్నర్‌గా ఏడాది పూర్తి కావడం సంతోషంగా వుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానని తమిళిసై స్పష్టం చేశారు.

కాగా కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు గవర్నర్ తమిళిసై . వీసీల నియామకం చేపట్టకపోవడంపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 రోజుల్లోగా వీసీలను నియమించాలని ఆమె ఆదేశించారు.

తెలంగాణలోని 11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వీసీల నియామకం కోసం 2019 జులై 3న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని అయినా కూడా ఇప్పటివరకు వీసీలలో ఎందుకు నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios