హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్  ప్రతిష్టాత్మక  టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికయ్యారు.యుఎస్ లోని కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారు అందజేసే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా. తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు. 

గవర్నర్ తో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.ఈ అవార్డును 9వ వార్షిక కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ప్రధానం చేస్తారు.

ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందిస్తారు. సమాజ హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా. తమిళిసై సౌందరరాజన్ కు ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. 

తెలంగాాణ గవర్నర్ తో పాటు ఇటీవలనే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసై బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.