హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ విద్యార్ధులకు పార్మటివ్ అస్సెస్మెంట్ మార్కుల ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం టెన్త్ విద్యార్థులను  తెలంగాణ ప్రభుత్వం ప్రమోట్ చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి ఒక్క విద్యార్ధిని పాసైనట్టుగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను కూడ తెలంగాణ ప్రభుత్వం ప్రమోట్ చేసింది. 

also read:ఏప్రిల్ 27 నుండి తెలంగాణలో వేసవి సెలవులు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్‌ను విద్యార్థుల మార్కుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఫార్మటివ్ అస్సెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్ధులకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం టెన్త్ విద్యార్ధులకు మార్కుల అప్‌లోడింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. పోస్ట్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రారంభించింది.  రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులున్నారు. గత ఏడాది కూడ ఇదే పద్దతిలో టెన్త్ విద్యార్ధులను ప్రమోట్ చేశారు. 

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు కూడ సెకండియర్ కు ప్రమోట్ అయ్యారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంి నిర్ణయం తీసుకోలేదు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఈ పరీక్షలపై నిర్ణయం తీసుకొంటామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.