కరీంనగర్: కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో బుధవారం నాడు మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

బయటి దేశాల నుండి వస్తున్నవారికి టెస్టులు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. విదేశాల నుండి వచ్చిన వారికి ఎయిర్ పోర్టులోనే టెస్టులు చేసి ఐసోలేషన్ కు పంపుతామన్నారు. పాజిటివ్ వస్తే కచ్చితంగా ఆసుపత్రిలో చేరాలని ఆయన కోరారు. 

శీతాకాలం  మరో నెల రోజులు ఉంది. కాబట్టి ఈ నెల రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.ఏ పరిస్థితి వచ్చిన ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని ఆయన చెప్పారు.

సెకండ్ వేవ్ రాకూడదని ఎలా తగ్గిపోయిందో అలాగే ఉండాలని  కోరుకుంటున్నానన్నారు. స్ట్రెయిన్ ను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ప్రజలందరూ దైర్యంగా,అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.