Telangana: సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో తెలంగాణ దేశం మొత్తానికి ఆద‌ర్శంగా ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఎస్.నిరంజ‌న్ రెడ్డి అన్నారు. క‌ళ్యాణ ల‌క్ష్మి ద్వారా రాష్ట్రంలోని 10 ల‌క్ష‌ల మంది పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం అందించింద‌ని తెలిపారు.  

Telangana: సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో తెలంగాణ దేశం మొత్తానికి ఆద‌ర్శంగా ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి (Agriculture Minister S Niranjan Reddy) అన్నారు. క‌ళ్యాణ ల‌క్ష్మి ద్వారా రాష్ట్రంలోని 10 ల‌క్ష‌ల మంది పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం అందించింద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్ర‌భుత్వం మెరుగైన పాల‌న అందిస్తున్నద‌ని ఆయ‌న తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ (Telangana) వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి ఆదివారం నాడు వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి , సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. క‌ళ్యాణ ల‌క్ష్మి పథకం కింద ప్రభుత్వ సహకారంతో సుమారు 10 లక్షల వివాహాలు జరిగాయని, పేద, బడుగు వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషికి ఇదే నిదర్శనమని అన్నారు. క‌ళ్యాణ ల‌క్ష్మి (Kalyana Lakshmi scheme), కేసీఆర్ కిట్ (KCR Kit), రైతు బంధు (Rythu Bandhu), రైతు భీమా (Rythu Bheema)పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వాటిని దేశవ్యాప్తంగా అనుసరించవచ్చని ఆయన (Singireddy Niranjan Reddy) అన్నారు.

ఆదివారం ఇక్కడ 210 మంది కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi scheme) లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అలాగే, మ‌రో 56 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.26.46 లక్షల విలువైన చెక్కులను మంత్రి నిరంజ‌న్ రెడ్డి పంపిణీ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల యావత్ దేశం తెలంగాణ (Telangana) వైపు చూస్తున్న‌ద‌ని మంత్రి అన్నారు. రాజకీయ వ్యూహం కోసమే రైతుబంధు (Rythu Bandhu) పథకాన్ని ప్రవేశపెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శల‌ను ఆయ‌న ఖండించారు. రైతు బంధు ప‌థ‌కం కింద ఇప్పటివరకు ఎనిమిది ఎడిషన్లలో రూ.50,400 కోట్లు రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయ‌న (Singireddy Niranjan Reddy)వెల్ల‌డించారు. 

అలాగే, కరోనా వైర‌స్ (Coronavirus) మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలమైనప్పటికీ, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖ‌ర్ రావు హామీ ఇచ్చారని మంత్రి నిరంజ‌న్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలను బట్టి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (Chief Minister Relief Fund) కింద నాలుగు లక్షల మందికి రూ.2000 కోట్ల ఆర్థిక సాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.పేదలు ఇబ్బందులు పడొద్దనే వివిధ పథకాలకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ (Chief Minister K Chandrashekhar Rao) రూపకల్పన చేశారన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్ళచెరువు సుందరీకరణ పనులను సైతం మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ప‌రిశీలించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపురంలో 96 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేశారు.