హుజూరాబాద్ బైపోల్ ఎఫెక్ట్: బీసీ కమిషన్ ఛైర్మెన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ నియామకం
తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మెన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నియమించింది. గతంలో ఆయన బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. బీఎస్ రాములు ఛైర్మెన్ గా ఉన్న కృష్ణమోహన్ బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.
హైదరాబాద్:తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మెన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నియమించింది. గతంలో బీసీ కమిషన్ చైర్బెన్ గా బీఎస్ రాములు పనిచేసిన సమయంలో బీసీ కమిషన్ సభ్యుడిగా వకుళాభరణం కృష్ణమోహన్ పనిచేశారు. బీసీ కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిశోర్ గౌడ్, శుభప్రదపాటిల్ లను ప్రభుత్వం నియమించింది.
చాలా కాలంగా బీసీ కమిషన్ ఛైర్మెన్ నియామకం పెండింగ్ లో ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున బీసీ కమిషన్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
2016 అక్టోబర్ 22న బీఎస్ రాములు ఛైర్మెన్ గా ప్రభుత్వం బీసీ కమిషన్ ను నియమించింది., ఆ సమయంలో వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్ లను బీసీ కమిషన్ సభ్యులుగా నియమించారు.
ఈ కమిటీ పదవీకాలం పూర్తైన తర్వాత కొత్త కమిటీ నియామకం చేయలేదు. ఈ లోపుగా ఎన్నికలు వచ్చిన తర్వాత మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీసీ కమిషన్ ను నియమించలేదు.
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ సమయంలో ఈటల రాజేందర్ ను లక్ష్యంగా చేసుకొని వకుళాభరణం కృష్ణమోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కృష్ణమోహన్ పేరు కూడ ఒకానొక దశలో ప్రచారం కూడా సాగింది.
కానీ టీఆర్ఎస్ చివరికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపింది.హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ ను నియమించిందనే విమర్శలు కూడా లేకపోలేదు.