నిర్మల్ వైఎస్సార్ కాలనీలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. 

నిర్మల్ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ లో రెండు పార్టీల మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిర్మల్ వైఎస్సార్ కాలనీలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. తాము ప్రచారం చేస్తుండగా బిజెపి నాయకులు వచ్చారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred