సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే అంటే నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.

హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం  పూర్తి చేసింది. ఇక  సమస్యాత్మకంగా ఉండే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ను నియమిత సమయానికంటే గంటముందే ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే అంటే నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజకవర్గాలు  సిర్పూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, చెన్నూరు, ములుగు, మంథని, పినపాక, మంచిర్యాల, ఇల్లందు, అసిఫాబాద్, అశ్వరావుపేట, కొత్తగూడెం, భద్రాచలంలు. ఈ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఇది సాయంత్రం నాలుగు గంటల వరకే కొనసాగుతుంది.  ఇక మిగతా 106 స్థానాల్లో  ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉండనున్నట్లుగా నోటిఫికేషన్ లో తెలిపారు.