Telangana: తెలంగాణ ఉద్యమకారిణి జయచంద్రిక ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థిక సాయం ఐదు లక్షల రూపాయలను ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా అందుకున్నారు.
Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విద్యా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడిందని పేర్కొన్నారు. ప్రగతి బాటలో తెలంగాణ విద్యా వ్యవస్థ ముందుకు సాగుతున్నదని తెలిపారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో జయ చంద్రిక అనే తెలంగాణ ఉద్యమకారిణికి.. ఉన్నత విద్యకు గాను.. రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్సీ కవిత (mlc kalvakuntla kavitha) చేతుల మీదుగా అందజేశారు.
ప్రతి జిల్లాలో పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం(TRS Govt.) అన్ని స్థాయిల్లో అత్యున్నత విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దాంతోపాటు విదేశీ విద్యకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోందని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించనుండటం బాలబాలికల ఉన్నత భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తుందని తెలిపారు.
జయచంద్రిక బాల్యం నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ వేళ తెలంగాణ తల్లి వేషాధరణతో జయచంద్రిక ప్రతి సమావేశంలోనూ ఆకర్షణీయంగా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. జయచంద్రిక ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం అందించిన మనికొండ రంజీత్ ను ఎమ్మెల్సీ కవిత (mlc kalvakuntla kavitha) అభినందించారు.
కాగా, అంతకు ముందు రోజు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే యువకులు ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా చదువుపై దృష్టి సారించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 80,000 ఉద్యోగాలను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. ప్రకటన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పొందనున్న 3,978 మంది సెర్ప్ ఉద్యోగులు, 378 మంది మెంపా ఉద్యోగుల తరపున ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు mlc kalvakuntla kavitha కృతజ్ఞతలు తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకం(mid-day meal scheme)లో నిమగ్నమై ఉన్న 54,201 మంది కార్మికులకు గౌరవ వేతనం ప్రస్తుతం నెలకు రూ.1,000 నుంచి రూ.3,000లకు పెంచుతామని ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. యువత మరియు వారి కుటుంబాలు సహజమైన సేంద్రీయ రంగులను ఉపయోగించాలని మరియు పర్యావరణం పట్ల రక్షణగా ఉండాలని ఆమె (mlc kalvakuntla kavitha) విజ్ఞప్తి చేశారు
