హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి సోమవారం నాడు విడుదల చేశారు.

సోమవారం నాడు తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది  బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం హాజరైనట్టుగా ఆయన ప్రకటించారు.

ఈ ఏడాది మార్చి 16 నుండి ఏప్రిల్ 3 వతేదీ వరకు నిర్వహించారు. రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అన్ని జిల్లాల కంటే ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించినట్టుగా ఆయన ప్రకటించారు. హైద్రాబాద్ జిల్లా నుండి అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైనట్టుగా ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 93.68 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధిస్తే, బాలురు 91.18 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారని జనార్ధన్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లాలో 99.73 శాతం ఉత్తీర్ణత సాధిస్తే , హైద్రాబాద్ 83 శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 పాఠశాలల్లో  సున్న ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది జూన్ 10వ తేదీ నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.