Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: ఫిబ్రవరి 1 నుంచి కళాశాలల ప్రారంభం.. 50 శాతమే అనుమతి

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కళాశాలలు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది

telangana education minister sabitha indra reddy review meeting on colleges opening ksp
Author
hyderabad, First Published Jan 29, 2021, 7:58 PM IST

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కళాశాలలు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

శుక్రవారం విద్యా శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రతీ కళాశాల తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.

కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను తరుచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. 

ప్రతినిత్యం తరగతి గదులను శానిటైజేషన్ చేపట్టేందుకు వీలుగా ప్రతీ యూనివర్సిటీకి 20 లక్షల రూపాయలను తక్షణ సాయంగా అందించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిని ఆదేశించారు.

కళాశాలలు పూర్తి సురక్షితం అన్న భావనను విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో కల్పించాలని మంత్రి సూచించారు. కళాశాలల్లో విద్యార్థులు గుమికూడకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత యాజామాన్యాలదేనని ఆమె స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios