హైదరాబాద్: విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన తెలంగాణ వైద్యుడు కులు మనాలిలో అకాల మృత్యువాత పడ్డాడు. అతన్ని హైదరాబాదులోని నాగోల్ కు చెందిన డాక్టర్ ఎల్ చంద్రశేఖర్ గా గుర్తించారు. 

డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాదులోని శ్రీకర ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ప్యారాచూట్ తెగిపడడంతో ఆయన మృత్యువాత పడ్డాడు. అతను ఫిజియోథెరపిస్టు. వివరాలు తెలియాల్సి ఉంది.