తెలంగాణలో లాక్‌డౌన్: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే.. డీజీపీ హెచ్చరిక

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. లాక్‌డౌన్‌ అమలుపై సీపీలు, ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

telangana dgp mahender reddy video conference with police officials ksp

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. లాక్‌డౌన్‌ అమలుపై సీపీలు, ఎస్పీలు, డీఐజీ స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలని.. రెండో డోసు వ్యాక్సిన్‌కు వెళ్లేవారికి, మొదటి డోసు సమాచారం చూపించిన వారికి అనుతివ్వాలని డీజీపీ సూచించారు. నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు పాసులు జారీ చేయాలని మహేందర్ రెడ్డి సూచించారు.

Also Read:తెలంగాణలో లాక్ డౌన్: వీటికి మినహాయింపులు, పెళ్లిళ్లూ అంత్యక్రియలపై ఆంక్షలు

అత్యవసర ప్రయాణాలకు సీపీలు, ఎస్పీలు ఈ-పాస్‌లు జారీ చేయాలని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు గుర్తింపు కార్డులను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని కోరారు. వివాహాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత నేపథ్యంలో రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిత్యావసరాల కొనుగోలు కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సర్కార్ అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రెడీ అవుతున్నారు. అటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios