హైదరాబాద్: తెలంగాణ ఉపసభాపతిగా మాజీమంత్రి పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సభాపతిగా పద్మారావు గౌడ్ ఏకగ్రీవానికి అన్ని పార్టీలు ఆమోద ముద్ర వేశాయి. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎంపికయ్యారు. 

పద్మారావుగౌడ్ ఉపసభాపతిగా ఎన్నికైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అనంతరం పద్మారావుగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసులరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత మల్లుభట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా తనను ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన ఏకగ్రీవానికి మద్దతు పలికిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు ఉపసభాపతి పద్మారావు గౌడ్. 

పద్మారావు గౌడ్ మూడు సార్లె ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొంది కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.