కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తిలో పంపిణీ: కేఆర్ఎంబీలో తెలంగాణ డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కోరుతుంది.ఇదే విషయమై ఇవాళ జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ డిమాండ్ చేసింది.
హైదరాబాద్: Krishna River జలాల్లో 50:50 శాతం నిష్పత్తిలో పంచాలని తెలంగాణ డిమాండ్ చేసింది.శుక్రవారం నాడు తెలంగాణ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో Krishna జలాల పంపకంపై తెలంగాన ఈ డిమాండ్ ను లేవనెత్తింది.
2022-23 లో నీటి వాటాలు 66: 34 నిష్పత్తిలో పంపిణీని చేసుకొన్నారు. తాత్కాలికంగానే ఈ ఒప్పందం జరిగిందని Telangana వాదించింది. అయితే అదే పద్దతిలో ప్రతి ఏటా నీటి కేటాయింపులు చేయడాన్ని తెలంగాణ తప్పు బడుతుంది. రెండు రోజుల క్రితం ఇదే విషయమై తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ Rajat Kumar కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొంత కాలంగా నీటి వివాదాలు చోటు చేసుకొన్నాయి. కృష్ణా, గోదావరి రాష్ట్రాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు పరస్పరం పిర్యాదులు చేసుకొంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కి లేఖలు రాశారు. అంతేకాదు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది
అయితే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొంటే లాభ,నష్టాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ మురళీధర్ రావు నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేయనుంది.ఈ కమిటీ ఆదేశాల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏపీ మాత్రం ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకు రావడాన్ని స్వాగతించింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించిన తర్వాతే తాము కూడా అప్పగిస్తామని గతంలోనే ఏపీ కేంద్రానికి తేల్చి చెప్పింది.
నాగార్జునసాగర్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయని కారణంగా నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని తెలంగాణపై గతంలో ఏపీ ప్రభుత్వం పిర్యాదు చేసింది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ కూడా ఫిర్యాదు చేసింది. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా తెలంగాణ ఫిర్యాదులు చేసింది.
నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి కేఆర్ఎంబీకి ఈ ఏడాది ఏప్రిల్ 5న లేఖ రాశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు లోతెలంగాణ ప్రభుత్వం Electricity ఉత్పత్తి కోసం నీటిని ఉపయోగిస్తూ దిగువకు విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే Pulicninthala రిజర్వాయర్ కెపాసిటీ లెవల్ లో నీరుందని Andhra Pradesh ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా పులిచింతల నుండి కూడా నీటిని విడుదల చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ప్రకాశం బ్యారేజీలో కూడా నీరున్న విషయాన్ని ఏపీ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకొచ్చారు.