వరంగల్: తెలంగాణ సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి తృటిలో  పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ప్రమాద సమయంలో చాడ వాహనంలోనే వున్న సురక్షితంగా బయటపడ్డారు.

చాడ వెంకట్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును హన్మకొండలో మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో కారులో చాడతో పాటు వున్న ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే చాడ వెంకట్ రెడ్డి మాత్రం చిన్న గాయంకూడా కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.