తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి నాయకులపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి నష్టం కల్గించేలా ప్రవర్తించిన నాయకులను బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా డిసిసి ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ పై వేటు వేసిన అధిష్టానం అదేబాటలో పార్టీపై తిరుగుబాటు చేసిన నాయకులపై చర్యలు తీసుకుంది.  

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 మంది నాయకులు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించారని గుర్తించామని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తెలిపింది. అందువల్ల  వారందరిని   పార్టీలోంచి ఏడేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వారికి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటినుండి ఎలాంటి సంబంధం ఉండదని వెల్లడించారు. 

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణలోని ప్రతిపక్షాలన్ని(టిడిపి, సిపిఐ, టీజెఎస్) కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సీట్ల సర్దుబాటు, ఒకే నియోజకవర్గం నుండి ఎక్కువ మంది సీటు ఆశించడం ఇలా వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ లో చాలామంది ఆశావహులకు టికెట్లు రాలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు పార్టీ అధినాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు రెబల్ గా బరిలోకి దిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెబల్ నాయకులందరిని మూకుమ్మడిగా బహిష్కరించడం రాజీకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 

బహిష్కరణకు గురైన నాయకులు వీరే....

1. మునుగోడు - పాల్వాయి స్రవంతి

2. నారాయణపేట్‌ - శివకుమార్‌రెడ్డి

3. మహబూబ్‌నగర్ -ఇబ్రహీం 

4. మహబూబ్‌నగర్‌ - సురేందర్‌రెడ్డి
 
5. చెన్నూరు - బోడ జనార్దన్‌

6.  కొత్తగూడెం - ఎడవల్లి కృష్ణ 

7. వైరా - రాములు నాయక్‌  
 
8. సిర్పూర్‌ - రవి శ్రీనివాస్‌
 
9. ఖానాపూర్‌ -  హరినాయక్‌ 

10. బోథ్‌ - అనిల్‌ జాదవ్‌ 

11. ముథోల్‌ - నారాయణరావు పటేల్‌

12. జుక్కల్‌ - , అరుణతార

13. నిజామాబాద్‌ అర్బన్‌ - రత్నాకర్‌ 

14.  సికింద్రాబాద్‌ - శ్రీగణేష్‌  

15.  దేవరకొండ - బిల్యానాయక్‌-

16.  తుంగతుర్తి -  రవికుమార్‌

17.  డోర్నకల్‌ - నెహ్రూ నాయక్‌

18.  ఇల్లందు - వూకె అబ్బయ్య 

19.  ఇల్లందు - బాలాజీనాయక్‌