తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) కాంగ్రెస్ నేతలు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ నేతలు ఊసరవెల్లితో పోల్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) కాంగ్రెస్ నేతలు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ నేతలు ఊసరవెల్లితో (chameleon) పోల్చారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సోమవారం ఉదయం ట్విట్టర్‌లో ఊసరవెల్లి ఫొటో పోస్టు చేశారు. తెలుగులో ‘ఊసరవెల్లి’ స్పెషాలిటీ ఏమిటని రాసుకొచ్చారు. అయితే ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రాహుల్ గాంధీ.. కేసీఆర్ రోల్ మోడల్ అంటూ కామెంట్ చేశారు. #NeverTrustKCR అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు.
ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అస్సాం సీఎం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను నమ్మి కాంగ్రెస్ రెండు సార్లు మోపోయిందని.. మళ్లీ నమ్మి మోసపోమని చెప్పారు.
అస్సాం సీఎంపై ఫిర్యాదులు..
తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే హిమంత బిశ్వ శర్మపై కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హిమంత బిశ్వ శర్మపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాకుండా తెలంగాణలోని పలుచోట్ల హిమంత బిశ్వ శర్మ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అస్సాం సీఎం దిగజారి మాట్లాడినా బీజేపీ కనీసం ఖండించకపోవడం దారుణమని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదన్నారు. ఈ సందర్బంగా మళ్లీ కేసీఆర్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి రేవంత్ రెడ్డి బదులిస్తూ.. మోసగాడికి బ్రాండ్ అంబసిడర్ కేసీఆర్ అన్న ఆయన.. టీఆర్ఎస్ చీఫ్‌ను కాంగ్రెస్ రెండు సార్లు నమ్మి మోసపోయిందని.. మళ్లీ కేసీఆర్‌ని నమ్మి మోసపోమన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు.. ఒకరి దొంగతనం గురించి మరొకరి దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారని.. ఎవరైనా బయట పెట్టారా..? అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నాయన్న రేవంత్ ఆరోపించారు. కేంద్రంలో అవినీతి బయట పెడతా అంటే ఎవరు వద్దన్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇద్దరూ తోడు దొంగలేనని.. ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుని బతకాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ తమ పార్టీకి సమాన దూరమని చెప్పారు.
ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు రోజులు ఈ విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. ఎంతో చరిత్ర గల కుటుంబంపై సంస్కారం లేకుండా మాట్లాడటం సభ్యత కాదని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. బీజేపీ సభ్యత ఇదేనా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడాల్సిన ఖర్మ తనకు పట్టలేదని పేర్కొన్నారు.
