రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్లు నమ్మట్లేదా..? చంద్రబాబుతో భేటీపై ఈ రచ్చేంటి..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అనుమానాలను రేకెత్తించేలా కామెంట్స్ చేసారు.

Telangana Congress leader Jagga Reddy comments over CMs Chandrababu Revanth Reddy Meeting AKP

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీకి హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికయ్యింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సుధీర్ఘకాలంగా పెండింగ్ లో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాలకు మేలు చేసేందుకు సీఎంల భేటీ జరిగిందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. 

అయితే చంద్రబాబు, రేవంత్ మధ్య సమావేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరణ వ్యాఖ్యలు చేసారు. ఈ భేటీ వెనక రాష్ట్ర ప్రయోజనాలను, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్రలు దాగివున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణలో బిజెపి గేమ్ స్టార్ట్ చేసింది... అయితే నేరుగా కాకుండా చంద్రబాబును ముందుపెట్టి చాలా జాగ్రత్తగా కథ నడిపిస్తోందన్నారు. ఇలా పరోక్షంగా తెలంగాణను కబ్జా చేసేందుకు బిజెపి సిద్దమైంది... కాబట్టి కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ జాగ్రత్తగా వుండాలని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే బిజెపి తన మిత్రపక్షాలైన టిడిపి, జనసేనలను రంగంలోకి దింపిందని జగ్గారెడ్డి అన్నారు. విభజన సమస్యల పరిష్కారం కాదు... కాంగ్రెస్ ను దెబ్బతీయడమే చంద్రబాబుకు బిజెపి ఇచ్చిన టాస్క్ అని పేర్కొన్నారు. ఎన్డిఏలో భాగస్వాములైన కూటమి సీఎం చంద్రబాబు కేవలం విభజన సమస్యల పరిష్కారికే తెలంగాణ వచ్చారంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేసారు. 

జగ్గారెడ్డి మాటల్లో అంతరార్థమిదేనా..: 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై జగ్గారెడ్డి లేవనెత్తిన అనుమానాలతో పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇవి కేవలం జగ్గారెడ్డి మాటలేనా లేక కాంగ్రెస్ సీనియర్లందరి మాటలా..? చంద్రబాబు కుట్రను రేవంత్ అర్థం చేసుకోలేకపోయారని చెప్పాడా లేక రేవంత్ కూడా ఈ కుట్రలో భాగమే అని పరోక్షంగా చెప్పారా..? అసలు కాంగ్రెస్ రేవంత్ ను నమ్మడంలేదా..? రేవంత్ ను పక్కకు తప్పించే కుట్రలేమైనా జరుగుతున్నాయా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జగ్గారెడ్డి మాటల్లోని  అర్థరార్థం తెలిస్తేనే ఈ ప్రశ్నలకు ఓ క్లారిటీ వస్తుంది. 
  
ముందునుండి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకిస్తూ వస్తున్నారు... కానీ కాంగ్రెస్ అదిష్టానం మాత్రం ఆయనపైనే నమ్మకం పెట్టుకుంది.  ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చి చూపించారాయన. దీంతో కాంగ్రెస్ అదిష్టానం సీనియర్లను పట్టించుకోవమే మానేసింది... రేవంత్ ను ముఖ్యమంత్రిని చేయడమే కాదు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఏ నిర్ణయమైనా రేవంత్ దే.... అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఆయనే సుప్రీం. ఇది గతంలో రేవంత్ ను వ్యతిరేకించిన వారికి నచ్చడంలేదు. ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూస్తుండగా సీఎంల సమావేశంలో అవకాశం వచ్చింది.  

ఇప్పటికే చంద్రబాబు, రేవంత్  సమావేశంపై బిఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ తెలంగాణలో ఆంద్రోళ్ల పెత్తన మొదలయ్యిందని... తన శిష్యుడు రేవంత్ ద్వారా చంద్రబాబు తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నాడనే ప్రచారం ప్రారంభించింది. హైదరాబాద్ లో టిడిపి జెండాలు, చంద్రబాబు ప్లెక్సీలు, బ్యానర్ల  వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇదే అదునుగా జగ్గారెడ్డి సీఎంల భేటీపై అనుమానాలు మరింత పెరిగేలా మాట్లాడారు. 

 ప్రత్యర్థి పార్టీలు దుష్ఫ్రచారం చేస్తుంటే తిప్పికొట్టాల్సిన కాంగ్రెస్ వాళ్లు కూడా చంద్రబాబుతో రేవంత్ భేటీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడే జగ్గారెడ్డి సీఎంల భేటీపై అనుమానాలను బయటపెట్టారు... కానీ ఇది కేవలం ఆయన ఒక్కడి మాటేనా లేక సీనియర్లందరి మాటా అన్నది తెలియడంలేదు. మొత్తంగా జగ్గారెడ్డి మాటలు కేవలం చంద్రబాబును టార్గెట్ చేసినట్లు లేవు... సొంత పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇరకాటంలో పెట్టేలా వున్నాయి. 


 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios