టీ20 వరల్డ్ కప్ విజేత సిరాజ్ కు సీఎం రేవంత్ బంపరాఫర్...

ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2024 భారత్ వశమైంది.  ఈ విన్నింగ్ టీమ్ లో భాగస్వామ్యమైన హైదరబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. 

Telangana CM Revanth Reddy Felicitated Team India Bowler Mohammed Siraj AKP

Hyderabad : టీ20 ప్రపంచ కప్ హీరోలకు స్వదేశంలో అపూర్వ గౌరవం దక్కుతోంది. ఇటీవలే అమెరికా, వెస్టిండిస్ వేదికగా జరిగిన ఐసిసి టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఆటగాళ్ళు అదరగొట్టారు. ఇలా టీ20 క్రికెట్ లో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శించిన భారత్ మరోసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ విన్నింగ్ టీమ్ లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ కూడా భాగస్వామి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా అతడిని సన్మానించారు. 

ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ట్రోపీతో టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ లో సీఎం రేవంత్ ను కలుసుకున్నారు. ఈ క్రమంలో సిరాజ్ ను అభినందించిన సీఎం శాలువాతో సత్కరించారు. సిరాజ్ కూడా టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ కు అందించారు. సిరాజ్ సన్మాన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెటర్ గా రాణిస్తున్న హైదరబాదీ యువకెరటం సిరాజ్ కు రేవంత్ భారీ నజరానా ప్రకటించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని... అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలసిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

ఇదిలావుంటే టీ20 వరల్డ్ కప్ ట్రోపీతో స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలను కూడా అందుకున్నారు. ఇక ముంబైలో టీమిండియా ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. అయితే టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత స్వస్థలం హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్ కు కూడా ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ కూడా సిరాజ్ ను సన్మానించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios