తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సాగు, తాగు నీటి బాధలను శాశ్వతంగా పారదోలేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే... తెలంగాణలోని ఎంతో మంది రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయి. దీని కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే... ఈ ఎదురుచూపులకు పులిస్టాప్ పడింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కేవలం ప్రాజెక్టు ప్రారంభోత్సవ తేదీనే కాదు.. ఈ కార్యక్రమానికి వీచ్చేయనున్న ముఖ్య అతిథి పేరు కూడా ఖరారు చేశారు.

ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో విజయవాడకు వెళ్లి స్వయంగా జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు.