మల్లన్నసాగర్ నిర్వాసితులకు సహాయ, పునరావాసంపై తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ నెల 15న మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వ్యవహారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ ప్రక్రియను కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఏయే గ్రామాల్లో ఎంతమంది నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు.. ఎంత మొత్తంలో పంపిణీ చేశారని సీఎం వివరాలు తెలుసుకున్నారు.

మల్లన్న సాగర్ నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలని, సహాయ పునరావాస చర్యలు చేపట్టాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీఎం సమీక్ష జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, మే 11 నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ కేసీఆర్ గతంలోనే అధికారులను ఆదేశించారు.