తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ప్రతిష్టించిన గోదావరి మాత విగ్రహానికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శృంగేరి పీఠానికి చెందిన అర్చకుల ఆధ్వర్యంలో జల సంకల్ప యాగంలో సతీమణి శోభతో కలిసి పాల్గొన్నారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద బహుల దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని ఆయన మరికొద్దిసేపట్లో జాతికి అంకితం చేయనున్నారు. గవర్నర్ నరసింహాన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే జగన్ మేడిగడ్డకు చేరుకున్నారు. 

ముంబై నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బేగంపేట నుంచి హెలికాఫ్టర్‌లో కాళేశ్వరం బయలుదేరారు. అటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ కూడా కాళేశ్వరంకు బయలుదేరారు.