తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు.   కొల్హాపూర్ లోని మాతా అంబాబాయి ఆలయంలో  సీఎం కేసీఆర్  ప్రత్యేక పూజలు  నిర్వహించారు.

ముంబై: మహారాష్ట్రలో మాతా అంబాబాయి ఆయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారంనాడు ఉదయం సీఎం కేసీఆర్ హైద్రాబాద్ నుండి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఎయిర్ పోర్టులో సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుండి సీఎం కేసీఆర్ కొల్హాపూర్ లోని మహాలక్ష్మి మాతా అంబాబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలోని వాటేగావ్ గ్రామంలో ప్రముఖ సంస్కర్త అన్నాబావూ సాఠే జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అన్నా బాపూ బంధువుల ఇంటికి వెళ్తారు కేసీఆర్. అన్నాబావూ సాఠే విగ్రహనికి నివాళులర్పిస్తారు. కొల్హాపూర్ లోని సాధు మహారాజ్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు మహారాష్ట్ర నుండి సీఎం కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారు. 

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కేసీఆర్ పలు చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు.