తెలంగాణ నూతన సచివాలయం:ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణ సచివాలయ నూతన భవనాన్ని కేసీఆర్ ఇవాళ ఆవిష్కరించారు.  

Telangana CM  KCR inaugurates new secretariat building  lns


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  ఆదివారంనాడు  కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు.  ఇవాళ  మధ్యాహ్నం  1:20  గంటల  సమయంలో  నూతన  సచివాలయం శిలాఫలాకాన్ని  కేసీఆర్ ఆవిష్కరించారు. 

 తెలంగాణ  సచివాలయం  ప్రధాన గేటు వద్ద  సీఎస్  శాంతికుమారి,  మంత్రి ప్రశాంత్ రెడ్డి లు  సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు.  ప్రధాన గేటు నుండి తెలంగాణ  సీఎం కేసీఆర్ నడుచుకుంటూ  వెళ్లారు.  సచివాలయ  ప్రాంగణంలో  నిర్వహించిన  యాగం వద్ద  వేద పండితుల ఆశీర్వాదాలు  కేసీఆర్ తీసుకున్నారు.  

 

ఆ తర్వాత    సచివాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కేసీఆర్ . అనంతరం సచివాలయం  ప్రారంభోత్సవం  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అక్కడి నుండి బ్యాటరీ కారులో  కేసీఆర్  సచివాలయాన్ని పరిశీలించారు. అనంతరం  ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కు కేసీఆర్ వెళ్లారు.   తన ఛాంబర్ లో  పలు ఫైళ్లపై  కేసీఆర్ సంతకాలు  చేశారు.     తన ఛాంబర్ లో  వేడ పండితుల ఆశీర్వాదాలు కేసీఆర్ తీసుకున్నారు. కొత్త చాంబర్ లో  ఆసీనులైన ముఖ్యమంత్రికి పలువురు ప్రజా ప్రతినిధులు,  అధికారులు  శుభాకాంక్షలు తెలిపారు.  పలువురు  ప్రజా ప్రతినిధులు  కేసీఆర్ కాళ్లకు నమస్కరించి ఆయన ఆశ్ీర్వాదాలు తీసుకున్నారు. 

ముందుగా నిర్ణయించినముహుర్తానికి అనుగుణంగా కేసీఆర్ తన ఛాంబర్ లో కూర్చున్నారు.   అదే సమయానికి పలువురు మంత్రులు కూడా తమ చాంబర్లలో ఆసీనులయ్యారు.  కొత్త ఛాంబర్ లో ఆసీలనులైన  మంత్రులు  పలు ఫైళ్లపై సంతకాలు  చేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios