రానున్న 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దశలవారీగా  అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని.. కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తామని కేసీఆర్ తెలిపారు. దళిత బంధు అమల్లో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు 

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. దళిత బంధు అమల్లో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నవంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ వుంటుందని సీఎం తెలిపారు. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే నెల 2న ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన చేస్తామని సీఎం తెలిపారు.

దళిత బంధుపై ప్రజలను చైతన్యం చేయాలని.. రానున్న 20 ఏళ్లు కూడా మనమే అధికారంలో ఉంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దశలవారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని.. కొత్త జిల్లా అధ్యక్షులను నియమిస్తామని కేసీఆర్ తెలిపారు. అనంతరం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2 నాడే గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. సెప్టెంబర్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో టీఆర్ఎస్ ద్వి దశాబ్ధి సభ నిర్వహణపై ఆలోచిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.