Asianet News TeluguAsianet News Telugu

ఘనంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లివేడుకలు నిర్వహించారు. చరణ్ రెడ్డి, ప్రత్యూష వివాహానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై నూనత వధూవరులను ఆశీర్వదించాడు.

telangana cm kcr adopted daughter marriage - bsb
Author
Hyderabad, First Published Dec 28, 2020, 4:52 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లివేడుకలు నిర్వహించారు. చరణ్ రెడ్డి, ప్రత్యూష వివాహానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై నూనత వధూవరులను ఆశీర్వదించాడు.

కాగా నిన్న ప్రత్యూష పెళ్లి కూతురు చేసేందుకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వయంగా వెళ్లారు. ఆమెతో పాటు మంత్రాలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.

కన్న తండ్రి, పిన తల్లి చేతిలో చిత్రహింసలకు గురయి దాదాపు చావు అంచులదాక వెళ్లిన ప్రత్యూష అనే యువతి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మామూలు మనిషిగా మారిన విషయం తెలిసిందే. యువతి కోలుకున్నాక ప్రగతిభవన్ కు పిలిపించుకుని తన కుటుంబంతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని కల్పించడమే కాదు ప్రత్యూషను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు.

ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్న ప్రత్యూష ఇప్పుడు ఓ ఇంటిది అయ్యింది.  ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తూ తన కాళ్లపై తాను నిలబడిన ఆమెకు చరణ్‌రెడ్డి అనే యువకుడితో పెళ్లి జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామం మేరీమాత దేవాలయంలో ఈ వివాహం జరిగింది. 

ఆదివారం కేసీఆర్ సతీమణి శోభ స్వయంగా వెళ్లి పెళ్లికూతురిని చేశారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారులు ప్రత్యూష యోగక్షేమాలను చూసుకుంటున్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలోనే శనివారం బేగంపేటలోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ గెస్ట్‌హౌజ్‌లోప్రత్యూషను పెళ్లికూతురును చేసే వేడుక నిర్వహించారు. అలాగే మెహందీ కార్యక్రమం కూడా చేపట్టారు.

రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంయుక్త సంచాలకురాలు కేఆర్‌ఎస్‌ లక్ష్మీదేవి, సునంద, గిరిజ, శారద, హైదరాబాద్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మోతి తది తరులు ప్రత్యూషను మంగళవాయిద్యాల నడుమ పెళ్లి కూతురుగా అలంకరించారు. ఇక పెళ్లికి కూడా పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనే అవకాశాలున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios