Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: ప్రభుత్వ భూముల అమ్మకానికి కాంగ్రెస్ వ్యతిరేకం.. సీఎల్పీ అత్యవసర భేటీ

కాసేపట్లో తెలంగాణ సీఎల్పీ అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రభుత్వ భూముల అమ్మకాలపై చర్చించనుంది సీఎల్పీ. భూముల అమ్మకంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ అంశంపై ఎలాంటి కార్యాచరణ అనుసరించాలన్న దానిపై సీఎల్పీ‌లో చర్చించనున్నారు.

telangana clp emergency meeting today ksp
Author
Hyderabad, First Published Jun 13, 2021, 3:10 PM IST

కాసేపట్లో తెలంగాణ సీఎల్పీ అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రభుత్వ భూముల అమ్మకాలపై చర్చించనుంది సీఎల్పీ. భూముల అమ్మకంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ అంశంపై ఎలాంటి కార్యాచరణ అనుసరించాలన్న దానిపై సీఎల్పీ‌లో చర్చించనున్నారు. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. వాటిని అమ్మడం వల్ల భవిష్యత్ తరాలకు ఏం సంకేతం ఇస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలన్నది కాంగ్రెస్ ఆలోచన. దీనిలో భాగంగానే జిల్లా కేంద్రాల్లో నిరసనలు, గవర్నర్‌ని కలవడం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి న్యాయస్థానాలను ఆశ్రయించడం వంటి ఎజెండాపై సీఎల్పీ చర్చించనుంది. 

Also Read:తెలంగాణ భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌ ! త్వరలో జారీ...

కాగా, నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని సర్కారు నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భూముల అమ్మ‌కానికి సంబంధించి ఈ నెల 15 న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ట్లు.. 25న ప్రీబిడ్ స‌మావేశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. జులై 13 రిజిస్ట్రేష‌న్ల‌కు చివ‌రి తేదీ అని 15వ తేదీ ఈ వేలం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించింది. భూముల విక్ర‌యాల్లో భాగంగా కోకాపేట‌లో 49.95 ఎక‌రాలు, ఖానామెట్‌లోని 15.1 ఎక‌రాల‌ను ప్లాట్లుగా విక్ర‌యించ‌నున్నారు. కోకాపేట‌లోని భూముల‌ను హెచ్ఎండీఏ, ఖాన్‌మెట్‌లోని భూముల‌ను టీఎస్ఐఐసీ వేలం నిర్వ‌హించ‌నున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios