సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ శాంతికుమారిలు బుధవారం నాడు సూర్యాపేటలో పర్యటించారు.

మంగళశారం నాడు ఒక్క రోజే సూర్యాపేట  జిల్లాలో 26 కరోనా పాజటివ్  కేసులు నమోదయ్యాయి. రోజు  రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.  రాష్ట్రంలో కరోనా కేసులపై సీఎం కేసీఆర్ మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

సీఎం ఆదేశాల మేరకు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారిలు ప్రత్యేక  హెలికాప్టర్ లో బుధవారం నాడు ఉదయం సూర్యాపేటకు చేరుకొన్నారు.

సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ ను సీఎస్ అధికారులు సందర్శించారు. సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డీఎస్పీలపై ప్రభుత్వం వేటు వేసింది.

also read:కరోనా వైరస్ టెన్షన్: సూర్యాపేట జిల్లా వైద్యాధికారిపై వేటు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌తో కంటైన్మెంట్ జోన్‌లతో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు.క్షేత్రస్థాయిలో  పనిచేస్తున్న అధికారులకు సీఎస్ పలు సూచనలు చేశారు. సూర్యాపేట జిల్లాలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.