వ్యాక్సిన్లు, మందుల సరఫరాలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వీటీలో అక్రమాలను అరికట్టేందుకు గాను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం ఏర్పాటయ్యే ఈ రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌కి మంత్రి కేటీఆర్ నేతృత్వం వహిస్తారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారు. 

Also Read:తెలంగాణలో లాక్ డౌన్: వీటికి మినహాయింపులు, పెళ్లిళ్లూ అంత్యక్రియలపై ఆంక్షలు

కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి నిమిత్తం పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 12వ తేదీ నుంచి 22 వరకూ ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. లాక్‌డౌన్ విధించడంతో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకే ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపమని ఆర్టీసీ ప్రకటించింది. వ్యవసాయ రంగానికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఈ నెల 20 కేబినెట్ మరోసారి సమావేశమై లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.