రేపు తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై చర్చించే చాన్స్
తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధిస్తే ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయనే దానిపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. లాక్‌డౌన్ విధించకుండా కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడ ఫోకస్ పెట్టనున్నారు.
అయితే రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో రాస్ట్రంలో లాక్ డౌన్ విధించే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్ విధిస్తే సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై కూడ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ లు నైట్ కర్ఫ్యూలు విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ లు అమలు చేశాయి. తెలంగానకు సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో కరోనా ేకసులు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఏపీ,లో పగటిపూట ఆంక్షలను అమలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.