మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలంగాణ తొలి కేబినెట్ సమావేశానికి సిద్ధమైంది. సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో కొత్తగా నియమితులైన మంత్రులు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో రేపు ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు.

రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనితో పాటు కీలకమైన జీఎస్టీ, అటవీశాఖ సవరణ బిల్లులను మంత్రివర్గం ఆమోదించనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు మందు ఇచ్చిన హామీలు, త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది.