వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి తెలంగాణ కేబినెట్ మంగళవారం నాడు చర్చించనుంది. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం 24 గంటల డెడ్ లైన్ విధించింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు Pragathi Bhavan లో జరగనుంది. వరి ధాన్యం కొనుగోలు అంశంపై Cabinet కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. Paddy ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి 24 గంటల డెడ్‌లైన్ ను సీఎం KCR విధించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి 24 గంటల పాటు సమయం ఇచ్చారు. TRS సర్కార్ చేసిన విమర్శలను కేంద్రం తిప్పికొట్టింది. అన్ని రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని తెలంగాణలో అనుసరిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. దేశంలోని ఏ రాష్ట్రం నుండి Boiled Rice ను తాము కొనుగోలు చేయడం లేదని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే చెప్పారు. 

యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది. అయితే వరి ధాన్యం పండించాలని BJP రైతులను రెచ్చగొట్టిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది వరి ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది. ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ లను కూడా టీఆర్ఎస్ నేతలు చూపించారు.

అయితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాసిచ్చి ఇవాళ బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం సరైందా అని బీజేపీ ప్రశ్నిస్తుంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు కేంద్రంపై నెపం నెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో వరి దాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా రైతుల నుండి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశంపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. అయితే ధాన్యం కొనుగోలు చేయడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 7500 కోట్లకు పైగా నష్టపోయిందని కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేయబోమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ విషయమై నిర్ణయం తీసుకొనేందుకే ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.

వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంత కాలంగా మాటల యుద్ధం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలోనిమ్ము నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. యాసంగిలో రైతులను వరి పంట పండించవద్దని తాము చెప్పామని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే రైతులు వరి పంట వేశారని టీఆర్ఎస్ చెబుతుంది. వరి పండిస్తే కేంద్రంతో చెప్పి తాము ధాన్యం కొనుగోలు చేయిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.