తెలంగాణ యువకుడి ప్రతిభకు అరుదైన గౌరవం దక్కింది.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే వేదికల్లో ఒకటైన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్రానికి చెందిన యువకుడు స్థానం సంపాదించాడు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.. దీనిని నడిపించే బిజినెస్ ఎంగేజ్‌మెంట్ ఆపరేషన్ స్పెషలిస్ట్‌గా వరంగల్ జిల్లాకు చెందిన రంజిత్ రెడ్డి అవకాశం దక్కించుకున్నారు.

దీని కోసం ఆయనకు ఏడాదికి రూ.65 లక్షల చొప్పున వేతనం అందనుంది. సాధారణ బస్సు డ్రైవర్ కొడుకైన రంజిత్ రెడ్డి మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో చదువుకున్నారు. విద్యాభ్యాసం మొత్తం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పూర్తి చేసిన రంజిత్ ఉన్నత చదువుల కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు..

జ్యూరిక్లోని వర్సిటీలో చదువుతూ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో స్ధానం సంపాదించాడు. ప్రపంచంలోనే తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ఒక తెలుగువాడు నడిపిస్తుండటం... తెలుగుజాతికి గర్వకారణం.