మిషన్ భగీరథ నిర్వహణకు రూ.1000 కోట్లు
ఆర్టిసికి రూ.1,500 కోట్లు

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ 2023-24 ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్ ఎలా వుంటుందోనని ఎదురుచూసిన రాష్ట్ర ప్రజానీకం ముందుకు బడ్జెట్ వివరాలు వచ్చాయి.
మిషన్ భగీరథ నిర్వహణకు రూ.1000 కోట్లు
ఆర్టిసికి రూ.1,500 కోట్లు
2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.2,90,394 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,11చ685 కోట్లు
మూలధన వ్యయం రూ.37,527 కోట్లు
తెలంగాణ ప్రగతి ప్రస్థానం విజయవంతంగా సాగుతోంది. అభివృద్దికి మానవీయ కోణం అద్దిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ అభివృద్ది నమూనాకు దేశం జేజేలు. తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కొనసాగుతోంది.
ఉద్యోగ నియామకాలు :
స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అందించే కొత్త నియామకాలు
1,41 వేల ఉద్యోగాల భర్తీ పూర్తి
80 వేల 30 పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా
కొత్తగా నియమితులయ్యే ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్ లో రూ.1000 కోట్లు
హోం శాఖ :
హోం శాఖకు 9,599 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం సమీకృత కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం
తెలంగాణ పోలీసింగ్ అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్లు
పరిశ్రమల శాఖ :
పరిశ్రమల శాఖకు రూ.4, 037 కోట్లు
ఐటీ ఉద్యోగాల నియామకాల్లో 100శాతం వృద్ది
ఐటీ ఉద్యోగుల సంఖ్య 8 లక్షలకు చేరింది
టాప్ 5 టెక్నాలజీ కంపనీలు హైదరాబాద్ కు
వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఐటీ టవర్ల నిర్మాణం
ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్న ఐటీ
దావోస్ సదస్సు ద్వారా రూ.21 వేల కోట్ల పెట్టుబడులు
రోడ్లు భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
రోడ్లు భవనాల శాఖలో భారీ ఉద్యోగాల భర్తీతో పాటు సమూల మార్పులు
భూలోక స్వర్గంగా యాదాద్రి నరసింహస్వామి ఆలయం
ఆలయాన్ని పున:నిర్మించిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
బుద్దవనం ప్రాజెక్ట్ కోసం భారీ నిధులు ఖర్చు
పురపాలక శాఖ కు రూ.11, 372 కోట్లు
విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ కోసం రూ.6,250 కోట్ల సొంతనిధులు
హైదరాబాద్ అభివృద్ది కోసం భారీగా నిధులు ఖర్చు...
దేశంలో పట్టణాభివృద్దిలో అత్యధిక అవార్డులు పొందిన రెండో రాష్ట్రం తెలంగాణ
ఇప్పటివరకు గ్రామీణ పారిశుద్ద నిర్వహణ కోసం భారీగా నిధులు ఖర్చు... దీంతో ప్రజారోగ్యం మెరుగుపడింది.
పల్లె ప్రగతికి రూ.10వేల కోట్ల నిధులు గ్రామ పంచాయితీలకు
పంచాయితీ రాజ్ శాఖకు 31, 426 కోట్లు కేటాయింపు
కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం రూ.200 కోట్లు కేటాయింపు..33 జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయం
104 డయాలసిస్ సెంటర్ల ఏర్పాట్లు
ఆసరా ఫెన్షన్లు, ఉచిత బస్ పాస్
వైద్య ఆరోగ్య రంగానికి రూ.12, 161 కోట్లు
కంటి వెలుగు పథకం దేశానికే స్పూర్తిధాయకం... రెండో విడత కంటివెలుగు ప్రారంభోత్సవం సందర్భంగా డిల్లీ, పంజాబ్ లోనూ ఈ పథకాన్ని అమలుచేస్తామని ఆయా రాష్ట్రాల సీఎంలో కేజ్రీవాల్, భగవంత్ మాన్ ప్రకటన.
పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించాలన్న తాపత్రయం.
సమైక్య రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలుంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ కాలేజీల సంఖ్య 26 కు చేరనుంది.
ఎంబిబిఎస్ 6వేల పైచిలుకు
పిజి సీట్లు 2 వేల పైచిలుకు
విద్యార్థులకు సన్నబియ్యంతో మద్యాహ్న భోజనం అందిస్తున్నాం. ఇలా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.
విద్యాశాఖకు ఈ బడ్జెట్ లో రూ.19, 093 కోట్లు కేటాయింపు
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు హరితహారం. ఈ క్రమంలో అటవీ శాఖ, హరితహారంకు ఈ బడ్జెట్ లో 1,471 కోట్లు కేటాయింపు
మైనారిటీల సంక్షేమానికి రూ.2,200 కోట్లు
జర్నలిస్ట్ ల సంక్షేమానికి రూ.100 కోట్ల కార్పస్ పండ్
షాదీ ముబారక్ పథకానికి 450 కోట్లు కేటాయింపు
మహిళా, శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు కేటాయింపు