Bandi Sanjay: 317 జీవోను రద్దు చేయాల‌ని ప్రగతి భవన్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేపట్టిన  టీచర్లందరినీ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలన్నారు.

Bandi Sanjay: జీవో 317ను రద్దు చేయాలని తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసనలు వ్యక్తమ‌వుతున్నాయి. తాజాగా ప్రగతి భవన్‌ను ముట్టడికి టీచర్స్‌ యత్నించారు. ఈ క్ర‌మంలో ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్ర‌మంలో ముట్ట‌డికి య‌త్నించిన 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ క్ర‌మంలో పంజాగుట్ట నుంచి ప్రగతిభవన్ వరకు భారీ సంఖ్య‌లో పోలీసులు మోహరించారు.

జీవో 317 రద్దు చేసి స్థానికతను ఆధారంగా బదిలీ చేపట్టాలని మహిళా ఉపాధ్యాయురాలు డిమాండ్ చేశారు. అసంబద్ధంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని, సీనియార్టీ ప్రకారం కేటాయింపు జరగలేదని, 317 జీవో ప్రకారంగా బదిలీలతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈ జీవోను వెంట‌నే రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు.

317 జీవోను రద్దు చేయాల‌ని ప్రగతి భవన్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ చేసిన టీచర్ల అంద‌రినీ ప్రభుత్వం తక్షణమే విడుద‌ల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల స్థానికతకు ఈ జీవో గొడ్డలిపెట్టుగా మారిందనీ, జూనియర్​ ఉద్యోగుల స్థానిక‌త‌కు ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశ‌ముంద‌నీ, ఈ జీవోను సవరించే వ‌ర‌కు ఉద్యమం చేస్తామనీ, ఉద్యోగుల బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పోరాటాలను ఉధృతం చేస్తామని సంజయ్ ప్రకటించారు.