చంద్రబాబు అరెస్ట్ పై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే..?
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తెలంగాణ బీజేపీ నేత , ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ ప్రతిపక్ష నాయకుడ్ని ఇలా అరెస్ట్ చేశారంటే.. బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండి ఉండాలని అభిప్రాయపడ్డారు.

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు పుట్టుకోస్తున్నాయి. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడ సీబీఐ కార్యాలయానికి తరలించారు.
ఈ విషయంపై ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కోలా రియాక్ట్ అవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలు నాటకీయ పరిణామల మధ్య పవన్ ను విజయవాడ వెళ్ళేందుకు అనుమతిచ్చారు.
ఈ పరిణామాలపై తెలంగాణ బీజేపీ నేత , ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎంతోమంది రాజకీయ నాయకులు అరెస్టు కావడం, విడుదల కావడం సర్వ సాధరణమన్నారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఇంకో రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే వేళ ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేశారంటే .. ఇది ఓ సాహసమేననీ, ఇలాంటి సాహస పూరిత చర్యకు పాల్పడాలంటే.. అధికార పక్షం వద్ద చాలా కీలకమైన ఆధారాలు ఉండి ఉంటాయని అన్నారు.
\అంతే గానీ- ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి, ఆ పార్టీకి వచ్చేలా చేయరని తాను అనుకుంటున్నట్లు రఘునందన్ వ్యాఖ్యానించారు. బలమైన సాక్ష్యాధారాలు ఉంటేనే.. ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడానికి సహసిస్తారని అన్నారు. తనకు ఆ కేసు గురించి పూర్తి అవగాహన లేదని.. కానీ, ఇలాంటి సమయంలో అరెస్ట్ చేసి ప్రతిపక్ష పార్టీకి సింపథీ క్రియేట్ చేయాలని ఏ పాలకపక్షం అనుకోదని అన్నారు.