హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందర రాజన్‌ను బుధవారం నాడు బీజేపీ నేతలు రాజ్‌భవన్‌లో కలిశారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  సీఏఏకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయడంపై  బీజేపీ తీవ్రంగా మండిపడింది. 

బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, రాంచంద‌ర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, రాంచంద్రారెడ్డి తదితరులు బుధవారం నాడు  రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిశారు. రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని  బీజేపీ డిమాండ్ చేసింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని తప్పుబట్టింది.