తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులయిన దగ్గరి నుంచి తెలంగాణ బీజేపీకి ఒక నూతన జోష్ వచ్చినట్టుగా కనబడుతుంది. ఆయన తెరాస పై విరుచుకుపడుతూ దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న వర్చువల్ ర్యాలీల్లో కూడా కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. 

బయటకు బండి సంజయ్ ఈ తరహాలో దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ.... అంతర్గతంగా పార్టీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టుగా చెబుతున్నారు. పార్టీలోని సీనియర్లు బండి సంజయ్ ని నెగలనీయకుండా చేస్తున్నట్టుగా తెలియవస్తుంది. 

బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్ర అధ్యక్షుడు మారినప్పుడల్లా రాష్ట్ర కమిటీని కూడా మారుస్తారు. కానీ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అయితే జరిగింది కానీ.... రాష్ట్ర కమిటీని మాత్రం మార్చలేదు. 

పార్టీలోని సీనియర్లంతా ఇంకా రాష్ట్ర కమిటీలోనే ఉండడంతో... యువ నాయకుడైన బండి సంజయ్ దూసుకుపోలేకపోతున్నట్టుగా తెలియవస్తుంది. వాస్తవంగా ఈపాటికి తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి అయిదుగురు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు కార్యదర్శులు, ఒక కోశాధికారి. ఒక అధికార ప్రతినిధిని నియమించాల్సి ఉంది. 

కానీ కరోనా పరిస్థితిని సాకుగా చూపెట్టి సీనియర్లు అడ్డుపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2019 లోక్ సభ ఎన్నికలప్పటినుండి ఇతర పార్టీలకు చెందిన వలస పక్షులన్నీ బీజేపీ గూటికి చేరుకుంటున్నాయి. వారిలో డీకే అరుణ వంటివారు సైతం పార్టీ అధ్యక్షా పదవికి పోటీపడ్డారు. కానీ అధిష్ఠానం మాత్రం బండి సంజయ్ వైపే మొగ్గు చూపింది. 

ఇప్పుడు వారందరిని కూడా రాష్ట్ర కమిటీలో భాగస్వాములను చేయవలిసిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న సీనియర్లను ఎలా పక్కకు పెట్ట;లో అర్థం కాని బండి సంజయ్ పార్టీ అధిష్టానాన్ని ఈ విషయం గురించి సలహా అడిగాడట. దీనిపై స్పందించిన అధిష్టానం పార్టీలోని సీనియర్లను కేంద్ర కమిటీలోకి తయీసుకుంటామని మాటిచ్చినట్టుగా తెలుస్తుంది. 

సీనియర్లను గనుక కేంద్ర కమిటీలోకి తీసుకుంటే... అప్పుడు రాష్ట్ర కమిటీలో యువ రక్తాన్ని నింపడంతోపాటుగా, వివిధ పార్టీల నుంచి వచ్చినవారికి సైతం స్థానం కల్పించే ఆస్కారం ఉంటుందని అంటున్నారు. 

అసలే 2023 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణాలో జెండా పాతడానికి 2విశ్వప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీల నుండి మరింత మందిని నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్న తరుణంలో సీనియర్లను కేంద్ర కంమిట్టలోకి పంపి రాష్ట్రాన్ని పూర్తిగా బండి సంజయ్ చేతుల్లో పెట్టాలని యోచిస్తోంది అధిష్టానం.