మహిళా కార్మికులకు వాషింగ్ మెషిన్స్, స్మార్ట్‌ ఫోన్స్..: బీఎస్పీ మేనిఫెస్టో విడుదల

తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నిలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మేనిఫెస్టోను విడుదల చేసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. 'బహుజన భరోసా' పేరుతో మంగళవారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

Telangana assmbly elections 2023 BSP Promises Smartphones  Washing Machines For Women Workers and farmers ksm

తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నిలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మేనిఫెస్టోను విడుదల చేసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. 'బహుజన భరోసా' పేరుతో మంగళవారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో అన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించారు. తెలంగాణలోని మహిళా కార్మికులు, రైతులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు ఇస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ మరియు, ప్రాంతాల్లోని కార్మికులకు ప్రతి సంవత్సరం 150 రోజుల పాటు కనీస రోజువారీ వేతనం రూ. 350తో  ఉపాధి హామీ ఇచ్చారు. వారికి ఉచిత రవాణా, ఆరోగ్య బీమా కూడా అందించనున్నట్టుగా చెప్పారు. 

కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ పాఠశాలను నెలకొల్పుతామని అన్నారు. ఇంకా.. ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని బీఎస్పీ హామీ ఇచ్చింది. పౌష్టికాహారం, ఆరోగ్య బడ్జెట్‌పై ప్రతి సంవత్సరం రూ. 25,000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. 

బీఎస్పీ హామీలు..
>> కాన్షీ యువ సర్కార్: వచ్చే ఐదేళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. వీటిలో యాభై శాతం ఉద్యోగాలు మహిళలకు అందించబడతాయి.
>>పూలే విద్యా దీవెన: మండలానికి ఒక  ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. ఏఐ కోడింగ్ లో శిక్షణ.
>>బహుజన రైతు ధీమా: ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు సబ్సిడీపై హామీ. ధరణి పోర్టల్ రద్దు.
>> చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్. డ్రైవింగ్ శిక్షణ. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. లక్ష. 
>>భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.
>> బ్లూ జాబ్ కార్డ్‌: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ. రోజూ కూలీ రూ. 350కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత బీమా
>> నూరేళ్ల ఆరోగ్య ధీమా:  ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. పౌష్టికాహారం, ఆరోగ్య బడ్జెట్‌పై ప్రతి సంవత్సరం రూ. 25,000 కోట్లు కేటాయింపు
>>వలస కార్మికుల సంక్షేమ నిధి:  రూ.5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు. వలస కార్మికులకు వసతి. గిగ్ కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు.
>>షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం. ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షల సహాయం. ఇంటి పునర్నిర్మాణానికి రూ. లక్ష సహాయం
>>దొడ్డి కొమురయ్య భూమి హక్కు : భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios