తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆఖరు ఫలితం వెలువడే నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గం ఫలితమే ఆఖరిగా ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి శేరిలింగంపల్లి అతిపెద్ద నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆఖరు ఫలితం వెలువడే నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గం ఫలితమే ఆఖరిగా ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి శేరిలింగంపల్లి అతిపెద్ద నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు.
రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ కేంద్రాలు కలిగిన నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గంలో 580 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో 12 రౌండ్లకే దాదాపుగా ఫలితం వెలువడితే ఈ నియోజకవర్గంలో 20 రౌండ్ల వరకు ఫలితం వెలువడే అవకాశం లేదు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 42 రౌండ్లు ఉంటాయి. 20 రౌండ్ల తర్వాత కానీ ఫలితం వెలువడే అవకాశం లేదు. దీంతో శేరిలింగంపల్లి ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొననుంది. అటు శేరిలింగంపల్లి నియోజకవర్గాలతోపాటు పెద్ద నియోజకవర్గాలైన మేడ్చల్, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి స్థానాలకు కూడా 20 రౌండ్లు పూర్తైతే కానీ ఫలితం వెలువడే అవకాశం లేదు.
ఇకపోతే శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా భవ్య ఆనంద ప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆరికపూడి గాంధీలు పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఉంది.
