Asianet News TeluguAsianet News Telugu

55 మందితో తెలంగాణ కాంగ్రెస్ జాబితా: ఫస్ట్ లిస్ట్ ఇదే..


తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను  ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ  ఇవాళ ప్రకటించింది.

Telangana assembly Elections 2023: Congress  releases first list of candidates  lns
Author
First Published Oct 15, 2023, 9:16 AM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయనున్న  అభ్యర్థుల జాబితాను  ఆదివారం నాడు  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  55 మందితో  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.ఈ జాబితాలో ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, బీసీలకు 12 , వెలమలకు 7, రెడ్లకు 17,బ్రాహ్మణులకు రెండు, కొత్తగా పార్టీలో చేరిన  12 మందికి టిక్కెట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.మిగిలిన అభ్యర్థుల జాబితాను రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం, జూపల్లి కృష్ణారావులకు  కూడ తొలి జాబితాలో చోటు దక్కింది. కాంగ్రెస్ పార్టీ  జాబితాను ఇవాళ  విడుదల చేయనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ నిన్న  న్యూఢిల్లీలో  ప్రకటించారు.

Telangana assembly Elections 2023: Congress  releases first list of candidates  lns

అయితే ఇవాళ ప్రకటించిన జాబితాలో 55 మందికి మాత్రమే చోటు దక్కింది. గెలుపు అవకాశాలను ఉన్న అభ్యర్థులకు మాత్రమే టిక్కెట్లు కేటాయించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే  సర్వే ఫలితాలు,  సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని  అభ్యర్థులను ఖరారు చేశారు.

Telangana assembly Elections 2023: Congress  releases first list of candidates  lns

 

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే

1.జగిత్యాల-జీవన్ రెడ్డి
2.ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
3.రామగుండం-ఎంఎస్ రాజ్ ఠాకూర్
4.మంథని-దుద్దిళ్లశ్రీధర్ బాబు
5.పెద్దపల్లి-విజయరమణరావు
6.వేములవాడ-ఆదిశ్రీనివాస్
7.మానకొండూరు-కవ్వంపల్లి సత్యనారాయణ
8.మెదక్-మైనంపల్లి రోహిత్ రావు
9.ఆంథోల్-దామోదర రాజనర్సింహా
10.జహీరాబాద్-ఎ.చంద్రశేఖర్
11.సంగారెడ్డి-.జగ్గారెడ్డి
12.గజ్వేల్-తూముకుంట. నర్సారెడ్డి
13.బెల్లంపల్లి-గడ్డం వినోద్
14.మంచిర్యాల-ప్రేమ్ సాగర్ రావు
15.నిర్మల్- శ్రీహరిరావు
16.ఆర్మూర్-వినయ్ కుమార్ రెడ్డి
17.బాల్కొండ-ముత్యాల సునీల్ కుమార్
18.బోధన్-పి. సుదర్శన్ రెడ్డి
19.మేడ్చల్- వజ్రేష్ యాదవ్
20.చాంద్రాయణగుట్ట-బోయ నరేష్
21.సనత్ నగర్- కోట నీలిమ
22.నాంపల్లి-ఫిరోజ్ ఖాన్
23.కార్వాన్-మహ్మద్ అల్ అజ్రీ
24.గోషామహల్-మొగిలి సునీత్
25.యాకత్‌పురా-రవిరాజ్
26.సికింద్రాబాద్-సంతోష్ కుమార్
27.కొడంగల్ -రేవంత్ రెడ్డి
28.కుత్బుల్లాపూర్-కొలను హనుమంతరెడ్డి
29.ఉప్పల్-ఎం. పరమేశ్వర్ రెడ్డి
30.చేవేళ్ల-భీమ్ భరత్
31. పరిగి-టి. రామ్మోహన్ రెడ్డి
32. వికారాబాద్-గడ్డం ప్రసాద్
33.ముషీరాబాద్-అంజన్ కుమార్ యాదవ్
34. మలక్ పేట్- షేక్ అక్బర్
35. గద్వాల-సరిత తిరుపతయ్య
36.ఆలంపూర్-సంపత్ కుమార్
37.అచ్చంపేట-వంశీకృష్ణ
38.నాగర్ కర్నూల్-కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
39.కల్వకుర్తి-కసిరెడ్డి నారాయణరెడ్డి
40. కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు
41. నాగార్జునసాగర్- కుందూరు జయవీర్ రెడ్డి
42. హూజూర్ నగర్-నల్లమాద.ఉత్తమ్ కుమార్ రెడ్డి
43.కోదాడ-నల్లమాద. పద్మావతి
44. నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
45. నకిరేకల్-వేముల వీరేశం
46. ఆలేరు-బీర్ల అయిలయ్య
47. స్టేషన్ ఘన్ పూర్- శ్రీమతి సింగాపూరం ఇందిర
48.నర్సంపేట-దొంతి మాధవరెడ్డి
49.భూపాలపల్లి-గండ్ర సత్యనారాయణరావు
50. ములుగు-సీతక్క (ధనసరి అనసూయ)
51. మధిర- మల్లు భట్టి విక్రమార్క
52. భద్రాచలం-పోడెం వీరయ్య
53.మల్కాజిగిరి-మైనంపల్లి హన్మంతరావు
54.బహదూర్‌పుర-రాజేష్ కుమార్
55.షాద్ నగర్-కె.శంకరయ్య


 

Follow Us:
Download App:
  • android
  • ios