మందుబాబులకు చేదు వార్త.  తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. కేవలం మద్యం దుకాణాలే కాదు.. మద్యం లభించే రెస్టారెంట్లు, పబ్బులు, మిలిటరీ క్యాంటిన్లు.. వీటన్నింటినీ మూసివేయనున్నారు.

డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 5 వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 6గంటల  వరకు ఈ నిబంధన అమలులో ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.

తెలంగాణకు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలు కూడా మూసివేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. రిజిస్టర్ క్లబ్స్, రెస్టారెంట్లు కూడా మద్యం సర్వ్ చేయడానికి వీలులేదు. పోలింగ్ స్టేషన్ కి సమీపంలో నలుగురుకి మించి వ్యక్తులు సంచరించకూడదని కూడా అధికారులు తెలిపారు.